విభిన్న,విలక్షణమైన పాత్రలతో సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు నాని. అలాంటి నాని కోసం ఓ అద్భుతమైన కథ రెడీగా ఉంది అంటున్నాడు అవసరాల శ్రీనివాస్. నానీతో ఓ సూపర్ హిట్ మూవీ చేస్తానని కొంతకాలం క్రితమే అవసరాల చెప్పాడు.
నానికి పెరుగుతోన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్టు సన్నిహితులతో అవసరాల చెబుతున్నాడట. నాని కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నాడట.

ప్రస్తుతం నాని చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ‘అష్టా చమ్మా’ సినిమాలో నాని .. అవసరాల శ్రీనివాస్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాని హీరోగా ఎదుగుతూ వస్తుంటే, విభిన్నమైన పాత్రలను చేస్తూ .. దర్శకుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు అవసరాల.

