బాలయ్య టైటిల్‌తో వస్తున్న అల్లరి నరేష్..!

359
Allari Naresh
- Advertisement -

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం బంగారు బుల్లోడు టైటిల్ తో హీరో అల్లరి నరేష్ అలరించబోతున్నారు. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ చిత్రమిది. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్, పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో నరేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఆసాంతం ప్రేక్షకులను కామెడీతో మెప్పించనుంది. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సమ్మర్ చివరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మూవీలో అల్లరి నరేష్, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్ దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల తదితరులు నటించిస్తున్నారు.

- Advertisement -