బాలయ్య…తొలి యాడ్ వీడియో

86
NBK
- Advertisement -

నందమూరి బాలకృష్ణ..వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నటసింహంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు బాలయ్య. ఓ వైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు బుల్లితెరపై సత్తాచాటాడు బాలయ్య. ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన బాలయ్య..ఇటీవలె రెండో సీజన్‌ను ఇటీవల ప్రారంభించాడు. ఈ షో ద్వారా తిరుగులేని రేటింగ్ సంపాదించిన బాలయ్య…తన కెరీర్‌లో తొలిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో కనిపించబోతున్నారు.

శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నారు. తొలి కమర్షియల్‌ యాడ్‌ వీడియో వచ్చేసింది. సినిమాటిక్‌ స్టైల్‌లో 116 పారామౌంట్‌ వెంచర్‌ ను ప్రమోట్‌ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్ హాస్పిటల్‌ ద్వారా బాలకృష్ణ ఎంతోమంది పేదలకు సేవలందిస్తున్నారని తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

BB6..కెప్టెన్‌గా శ్రీహాన్‌

45ఏళ్ల జీవితంలో గుర్తుపెట్టుకునే సినిమా

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రం

- Advertisement -