‘బాలయ్య – ప్రియాంక’.. షాకింగ్ కాంబినేషన్

96
- Advertisement -

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నట సింహం బాలయ్య హీరోగా రాబోతున్న సినిమా షూట్ డిసెంబర్ 8న నుంచి స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్ పై ఇప్పుడు ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. బాలయ్య సరసన యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయబోతుంది. ఇది నిజంగా కొత్త కాంబినేషనే. నిజానికి చాలామంది హీరోయిన్లను ట్రై చేశారు.

అయితే.. మరీ ముదురు భామల పై అనిల్ రావిపూడి ఆసక్తి చూపించలేదు. అందుకే.. కొత్త కాంబినేషన్ ను సెట్ చేసే ప్రాసెస్ లో బాలయ్య – ప్రియాంక జవాల్కర్ జోడిని ఫిక్స్ చేశారు. ఎలాగూ ప్రియాంక జవాల్కర్ కి ప్రస్తుతం ఛాన్స్ లు లేవు. కాబట్టి.. ఆమెకు ఇది కచ్చితంగా బెటర్ ఛాయిసే. అందుకే.. ఈ సినిమా చేయడానికి ప్రియాంక జవాల్కర్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

కాకపోతే.. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా మెప్పించలేకపోయింది. హీరోయిన్ కి తక్కువ, ఐటమ్ గర్ల్ కి ఎక్కువ అని ప్రియాంక జవాల్కర్ కి పేరు ఉంది. నటనలో కూడా ఆమె టాలెంట్ పై చాలా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రియాంక జవాల్కర్ కి బాలయ్య సినిమా రావడం అనేది మంచి అవకాశమే.

మరి ఈ సినిమాతోనైనా ప్రియాంక జవాల్కర్ తన అందచందాలతో ఆకట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తాను అంటుంది. ఇక ‘అఖండ’ తర్వాత నట సింహం రేంజ్ మారిపోయింది. మరి బాలయ్య సరసన నటిస్తోంది కాబట్టి.. ప్రియాంక జవాల్కర్ రేంజ్ కూడా మారుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

నయనతార పై పుకార్ల మయం !

నటి పెళ్లి.. మళ్లీ పుకార్ల పరంపర

నిర్మాతను బూతులు తిట్టిన హీరోయిన్

- Advertisement -