ఇటీవల నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. అందులో కథానాయకుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ ‘మహానాయకుడు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో వున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. డైరెక్టర్ బోయపాటితో కలిసి మరో సినిమాలో నటించనున్నారు.
అయితే బోయపాటి సినిమాలు మాస్ ప్రేక్షకులని ఏ రేంజ్‌లో అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్యతో సింహా, లెజెండ్ చిత్రాలు తీసిన బోయపాటి త్వరలో ఆయనతో మూడో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణని పవర్‌ఫుల్ సీఎం పాత్రలో దర్శకుడు చూపించనున్నట్టు తెలుస్తుంది.
ఈ నెల మూడోవారం నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఈ చిత్రాన్ని బాలయ్య తన సొంత ప్రొడక్షన్ సంస్థ ఎన్‌బీకే బ్యానర్‌పై నిర్మించనుండడం విశేషం. త్వరలోనే ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ సినిమాతో హ్యట్రిక్ కొట్టాలని బోయపాటి, బాలయ్య భావిస్తున్నారు.