కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికే ఆదర్శం..

322
Asaduddin Owaisi
- Advertisement -

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు ప‌థ‌కం ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ఆ ప‌థ‌కాన్ని ఎన‌లేని విధంగా కీర్తించింది. క‌రువును పార‌ద్రోలేందుకు ఆ ప‌థ‌కం దివ్యౌష‌ధ‌మ‌ని కూడా అభిప్రాయ‌ప‌డింది. 130 కోట్ల భారత దేశానికి కూడా ఇప్పుడు రైతుబంధు ప‌థ‌కం ఎంతో అవ‌స‌ర‌మైంది.

అన్నం పెట్టే అన్న‌దాత‌ల‌కు మ‌రింత చేయూత‌నిచ్చిందుకు కేసీఆర్ స‌ర్కార్ చేప‌ట్టిన రైతుబంధు ప‌థ‌కాన్ని ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం కూడా కాపీ కొట్టింది. దేశ‌వ్యాప్తంగా క‌ర్ష‌కుల‌ను ఆదుకునేందుకు వినూత్నంగా ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కంతో ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ది. ప్ర‌ధాని మోదీ కూడా ఇప్పుడు కేసీఆర్ బాట‌నే ఎంచుకున్నారు.

Asaduddin Owaisi

దేశ రైతాంగాన్ని కాపాడేందుకు, వ్య‌వ‌సాయ‌ సంక్షోభాన్ని త‌రిమేందుకు మోదీ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాలు హ‌ర్షించే కిసాన్ స‌మ్మాన్ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం స‌క్సెస్‌ఫుల్‌గా అమ‌లు చేసిన రైతుబంధును మోదీ స‌ర్కార్ కాపీ కొట్ట‌డం నిజంగా అది కేసీఆర్ ఔన‌త్యానికి చెందుతుంది. కేసీఆర్ లాంటి రాజ‌కీయ దూర‌దృష్టి ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని ఈ ప‌థ‌కంతో తెలుస్తోంది.

ప్ర‌కృతి విల‌యంతో తాండ‌విస్తున్న అనేక క‌రువు ప్రాంతాలు ఇప్పుడు రైతుబంధు లాంటి ప‌థ‌కంతో స‌స్య‌శ్యామ‌లంగా మార‌నున్నాయి. ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్కే ద‌క్కుతుంది. దేశానికి దిశానిర్దేశం చేసే స‌త్తా కూడా కేసీఆర్కే ఉంద‌ని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇవాళ కేంద్ర బ‌డ్జెట్‌లో కిసాన్ స‌మ్మాన్ నిధిని ప్ర‌క‌టించిన త‌ర్వాత ఓవైసీ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

- Advertisement -