నటనకు నిర్వచనం…ఎన్టీఆర్

19
- Advertisement -

మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఘన నివాళి అర్పించారు నటులు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, పురందేశ్వరి.

ఎన్టీఆర్‌ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు బాలకృష్ణ. ఆ మహానుభావుడు నటకు విశ్వవిద్యాలయమని… ఎన్టీఆర్‌ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని వెల్లడించారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ అని కొనియాడారు.

ఎన్టీఆర్‌ ఒక పేరు, ఒక వ్యక్తి కాదని.. ఆయనొక సంచలనమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. చిత్రరంగంలో 320 సినిమాలకు పైగా నటించారని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముంద్ర వేసుకున్నారని తెలిపారు.

Also Read:బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో!

- Advertisement -