- Advertisement -
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళి అర్పించారు నందమూరి బాలకృష్ణ. ఇక విశాఖలోని స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్ లో ఆయన విగ్రహానికి పుల మాలతో నివాళులు అర్పించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్,పలువురు నేతలు.
ఈ సందర్బంగా మాట్లాడిన గంటా….తెలుగు జాతి సత్తాని చాటి చేపింది స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. కేవలం పార్టీ పెట్టి 9 నెలల్లో నే అధికారంలోకి వచ్చింది అంటే అది ఎన్టీఆర్ ఘనత అన్నారు. ఆయన ఆశయాలే మాకు స్ఫూర్తి…..2024 ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉందన్నారు. పార్టీకి అత్యున్నత మైన కమీటీ ఉంది… ఆ కమీటీ అనుగుణంగా నే ఎన్నికల్లోకి ముందుకు వెళ్తామన్నారు.
- Advertisement -

