బాలయ్య ఫ్లాప్ మూవీస్…రీ రిలీజ్!

32
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డే రోజు వారి బ్లాక్ బస్టర్ మూవీలు థియేటర్‌లలో రీరిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ కాగా తాజాగా ఫ్లాప్ సినిమాలు కూడా రి రిలీజ్ అవుతున్నాయి.అది బాలయ్య బాబు సినిమాలు.

బాలకృష్ణ అంటేనే వెండితెర ప్రత్యేకం. తొడ కొట్టడమైనా,ట్రైన్‌లు వెనక్కి వెళ్లడం అన్నా ఆయనకే చెల్లుతుంది. అయితే ఎన్నో సినిమాలు హిట్ అయినా కొన్ని మాత్రం ఫ్లాప్‌ల బాట పట్టాయి. ఆ కోవకే చెందిన సినిమాలు ఒక్కమగాడు,లయన్.

Also Read:మహిళా ప్రయాణీకులకు TSRTC గుడ్‌ న్యూస్..

ఈ రెండు సినిమాలు త్వరలో రి రిలీజ్ కానున్నాయి. 2008 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఒక్క మగాడు మూవీని వైవిఎస్ చౌదరి తెరకెక్కించగా అనుష్క శెట్టి, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటించారు. 2015లో సత్యదేవ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూవీ లయన్. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని రుద్రపాటి రమణారావు నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. మరి రీ రిలీజ్‌లో సత్తా చాటుతాయా లేక డిజాస్టర్‌గా మిగులుతాయా వేచిచూడాలి..

- Advertisement -