టాలీవుడ్ లో ఎన్నో ఉంటాయి. ఒక సినిమా పూర్తి అయ్యేలోపు ఎన్నో లొసుగులు ఉంటాయి. అందుకేనేమో.. మన హీరోలు కూడా చాలా తెలివి మీరి పోతారు. సినిమా హిట్ అయితే అదే నిర్మాతతో మరో సినిమా చేస్తారు. అదే ప్లాప్ అయితే మళ్లీ ఆ నిర్మాత మొహం చూడరు. ఎందుకంటే ఎక్కడ కన్సెషన్ ఇవ్వాల్సి వస్తుందో అన్న లెక్కలు వుంటాయి. నిజంగా ఇలాంటి లెక్కలకు బాలయ్య బాబు దూరంగా ఉంటాడు అని టాక్ ఉండేది. నిర్మాత సి.కళ్యాణ్ తో బాలయ్య తీరు చూస్తుంటే.. బాలయ్య కూడా మారిపోయారు అనిపిస్తోంది.
గతంలో బాలయ్యతో సి. కళ్యాణ్ రెండు సినిమాలు చేశారు. ఆ సినిమాలు ఫ్లాప్ కాగానే నిర్మాత సి.కళ్యాణ్ ను ఊరడించి, మళ్లీ మరో సినిమా చేద్దాంలే.. డేట్ లు ఇస్తా అని చెప్పాడు. కానీ అది మాట వరకే. చాలా అంటే చాలా మంది ఆ మాట మీద వుండరు. అది టాప్ స్టార్ అయినా మిడ్ రేంజ్ హీరో అయినా. ఇప్పుడు బాలయ్య అయినా. సరైన హిట్ కోసం చాలా అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు సి.కళ్యాణ్. బాలయ్య ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. అందుకే, గత రెండేళ్ల నుంచి బాలయ్య వెంట తిరుగుతున్నారు సి.కళ్యాణ్.
సి.కళ్యాణ్ కు బాలయ్య మొహం చాటేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ, బాలయ్య అలా ఎందుకు దూరంగా వుంటారు అంటే, సి.కళ్యాణ్ తో సినిమాకి కమిట్ అయితే, రెమ్యూనిరేషన్ తక్కువకో చేయాల్సి వస్తుందని, ఎందుకంటే జైసింహా టైమ్ లో మరో సినిమా చేస్తానని బాలయ్య మాట ఇచ్చారని తెలుస్తోంది. అందుకే, సి.కళ్యాణ్ సినిమా దూరంగా ఉండటానికే బాలయ్య మొగ్గు చూపుతున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి బాలయ్య.. ఇలా అయితే ఎలా ?.
Also Read:Sree Leela:ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చింది