వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టిన బాల‌య్య‌..

243
balakrishna
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బిజీగా ఉన్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిండ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హారిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈమూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్ లో చిత్రిక‌రిస్తున్నారు. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న ఈసినిమా మొద‌టి భాగం క‌థానాయ‌కుడుగా రానుంది.

balakrishna boyapati

ఈచిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఈమూవీ త‌ర్వాత బాల‌కృష్ణ వివి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈప్రాజెక్ట్ కు సంబంధించిన స్ర్కీప్ట్ వ‌ర్క్ ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఇదే మూవీతో పాటు బోయ‌పాటితో కూడా సినిమా చేసేందుకు బాల‌కృష్ణ ఆసక్తిగా ఉన్నాడ‌ట‌.

balakrishna vv vinayak

రెండు సినిమాల‌ను ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌లో బాల‌య్య‌ ఉన్నాడని స‌మాచారం. ప్ర‌స్తుతం బోయ‌పాటి విన‌య విధేయ రామ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈసినిమా సంక్రాంతికి విడుద‌ల‌కానుడంటంతో ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తుంది.

- Advertisement -