టాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్,మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం మెగా,నందమూరి హీరోలు రాంచరణ్,ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుండగా తాజాగా మరో వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.ఈ మూవీకి క్రాంతి లేదా రూలర్ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వలో బాలయ్య సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి మల్టీస్టారర్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నందమూరి నటసింహం.
వేరే హీరోలతో చేస్తే కిక్ ఏముంటుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ నందమూరి హీరోలు ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్‌తో మల్టీస్టారర్ సినిమా చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. ఇప్పటివరకు వెంకటేష్ నాగార్జున,వెంకటేష్ మహేష్,వెంకటేష్ వరుణ్ తేజ్,వెంకటేష్ నాగచైతన్య మల్టీస్టారర్ సినిమాలు చేశారు. అయితే తాను మాత్రం నందమూరి హీరోలతోనే మల్టీస్టారర్ చేసేందుకు కమిట్ అయ్యారని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.