అనీల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటిస్తున్న NBK108 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం బాలయ్య , శ్రీలీల కాంబో సీన్స్ తీస్తున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో శ్రీలీల కిడ్నాప్ సీన్ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఘాట్ చేస్తున్నారు యూనిట్. ఈ సినిమాతో సరికొత్త బాలయ్య ను ప్రేక్షకులను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. తన స్టైల్ ఆఫ్ కామెడీ మిక్స్ చేస్తూనే బాలయ్య కోసం పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమాను తీస్తున్నాడు.
షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి ,హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమా కోసం తమన్ అదిరిపోయే రెండు సాంగ్స్ ఆల్రెడీ కంపోజ్ చేసి పెట్టాడని తెలుస్తుంది. బాలయ్య సరసన ఇందులో కాజల్ హీరోయిన్ గా నటించనుందని టాక్ ఉంది. మేకర్స్ ఇంకా ఈ విషయన్ని ఆఫీషియల్ ప్రకటించలేదు. త్వరలోనే కాజల్ ఘాట్ లో జాయిన్ కానుందని సమాచారం. బాలయ్య కాజల్ కాంబో లో వచ్చే మొదటి సినిమా ఇదే.
ఇవి కూడా చదవండి..