పింక్‌ రీమేక్‌లో బాలయ్య..?

525
Balayya next
- Advertisement -

బాలీవుడ్‌లో ‘పింక్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులను కొట్టేసింది. దాంతో సౌత్ లోని ఇతర భాషా చిత్రాల దర్శక నిర్మాతలను ఈ కంటెంట్ ఆకర్షించింది. వాళ్లంతా ఈ సినిమాను తమ భాషలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం `పింక్` చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా `నేర్కొండ పర్వాయ్` అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 10 రిలీజ్ కి రెడీ అవుతోంది.

pink

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తునట్లు సమాచారం. ఇందులో నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బాలయ్య కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి `లాయర్ సాబ్` అనే టైటిల్ కూడా అనుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ రీమేక్ పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

- Advertisement -