తొలిసారి పూరీజగన్నాధ్ డైరెక్షన్‌లో బాలయ్య చేస్తున్న నూటొకటో సినిమా టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ టైటిల్ విషయంలో కొంచెం తర్జనభర్జనలు జరిగాయి. ఈ సినిమాకు తనదైన స్టయిల్‌లో ‘తేడా సింగ్’ అనే టైటిల్‌ను పూరీ జగన్నాధ్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే టైటిల్ మార్చాలని బాలయ్య అభిమానులు డిమాండ్ చేశారు. అలా నిరాశలో ఉన్నవాళ్లందరికీ షాక్ ఇస్తూ.. బాలయ్యకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తూ.. ‘పైసా వసూల్’ అనే కొత్త టైటిల్‌తో బాలయ్యను కొత్త లుక్‌లో పరిచయం చేశారు పూరీ జగన్నాధ్.
ఈ సందర్భంగా అభిమానులు బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కామెంట్స్ రూపంలో పలు ప్రశ్నలు అడిగారు.గత ఏడాది బాలయ్య స్టేట్స్‌లో ఉన్నారని, ఇప్పుడు కూడా పోర్చుగల్‌లో ఉన్నారని.. దీంతో ఫ్యాన్స్ కోసం లైవ్‌చాట్ కు వచ్చిన బాలయ్య ‘‘కానీ.. టైటిల్‌కు మనం ఎంత టెన్షన్ పడ్డాం. ఈ టైటిల్ కన్ఫర్మ్ కాకముందు ఎటువంటి టైటిల్ ఇస్తే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారని.. అంటే మా కాంబినేషన్‌లో(పక్కనున్న పూరీ జగన్‌ను చూపిస్తూ) అని ఎగ్జయిట్ అయ్యాను. లుక్‌కు, టైటిల్‌కు ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ వస్తోంది.’’ అని బాలయ్య చెప్పారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో చాలా మంది అభిమానులు బాలకృష్ణ సినిమా టైటిల్స్, డైలాగ్‌లు పోస్ట్ చేశారు. వీటన్నింటినీ చదివిన పూరీ తన కంటే ఫ్యాన్స్ బాగా డైలాగ్స్ రాస్తున్నారని నవ్వారు. డైలాగ్‌లు రాసి పంపండి అన్నారు. ఆయన (బాలకృష్ణ) సినిమా మామూలుగా చేయట్లేదు. బాలయ్య 101 సినిమాలా లేదు ఇది, ఒకటో సినిమాలా ఉందని పూరీ ఓ ప్రశ్నకు సమధానంగా అన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నాకు రాసి పంపిన డైలాగ్‌లు అన్ని పెట్టుకున్నా. సినిమాలకు అవసరమైనప్పుడు చూస్తుంటా’ అన్నారు. బాలయ్య ఇంకేమన్నారో ఈ వీడియోలో చూడండి..