డీజేకు బాదుడే..!

162
double fares for duvvada jagannadham
double fares for duvvada jagannadham
- Advertisement -

‘బాహుబలి 2’ తర్వాత వస్తోన్న భారీ చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్‌’.. అల్లు అర్జున్-హరీష్‌ శంకర్‌ల కాంబినేషన్.. దేవిశ్రీప్రసాద్ సంగీతం.. దిల్ రాజ్‌ నిర్మాణ సారథ్యం.. ఇలా ఎన్నో వెరైటిలతో దువ్వాడ జగన్నాధం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాహుబలి 2 తరువాత స్టార్ హీరోల సినిమాలేవి రాలేదు కానీ.. ‘కేశవ’, ‘రాధ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’లాంటి మీడియం బడ్జెట్‌ సినిమాలే వచ్చాయి. ఇదే ‘డీజే’కి బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ ఏకంగా 70 కోట్లుగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బయ్యర్లే భారీ రేట్లకి కొంటే, వారి నుంచి మరింత భారీ మొత్తాలకి థర్డ్‌ పార్టీలు, ఎగ్జిబిటర్లు రైట్స్‌ సొంతం చేసుకున్నారు. అంత పెద్ద మొత్తం రికవర్‌ అవ్వాలంటే రేట్లు పెంచక తప్పదంటున్నారు.

DJ 1

ఈ సినిమాకు బాహుబలి 2 మాదిరే టికెట్లను ప్రీమియం రేట్లకు అమ్మటం.. ఐదు ఆటల మీద ఆశలు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. భారీ ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు. ఈ డబుల్‌ రేట్లు, ఎక్స్‌ట్రా షోల వల్ల ‘డీజే’కి ఓపెనింగ్స్‌ పరంగా ‘నాన్‌-బాహుబలి’ రికార్డు వస్తుందేమో చూడాలి. ఇకపై వచ్చే భారీ సినిమాలన్నిటికీ ఇదే పద్ధతి ఫాలో అవ్వాలా, వద్దా అనేది కూడా ఈ చిత్రం డిసైడ్‌ చేస్తుంది. ఇలాంటి వేళ వస్తున్న దువ్వాడ జగన్నాథమ్ షార్ట్ గా డీజే విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి తోడు.. ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టేయటం.. పంచ్ ల మీద పంచ్ లతో పాటు.. బన్నీ మార్క్ తో ఉన్న ఈ మూవీ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

- Advertisement -