NBK:మరో పీరియాడిక్ మూవీలో బాలయ్య?

20
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉన్నాడు. ఆయన గత మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో సీనియర్ హీరోలలో హ్యాట్రిక్ సాధించిన హీరోగా నిలిచాడు. ప్రస్తుతం బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత బాలయ్య చేసే సినిమా ఏదనె దానిపై క్యూరియాసిటీ నెలకొంది. ఎందుకంటే బాబీ మూవీ తర్వాత ఇప్పటివరకు బాలయ్య ఏ ప్రాజెక్ట్ ను కూడా ఒకే చేయలేదు. బోయపాటి తో అఖండ 2 ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నప్పటికి అధికారికంగా కన్ఫామ్ కాలేదు..

అలాగే బోయపాటి కూడా తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ సూర్యతో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీంతో అఖండ 2 ఇప్పట్లో లేనట్లేననేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ఓ కుర్ర దర్శకుడితో బాలయ్య తన నెక్స్ట్ సినిమా చేసే ఛాన్స్ ఉందట. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ మూవీస్ తీసిన రాహుల్ సంకృత్యాన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికే బాలయ్యకు స్టోరీ లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. రాహుల్ చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు కూడా నచ్చడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా కన్ఫామ్ చేసినట్లు వినికిడి. ఇది కూడా శ్యామ్ సింగరాయ్ మాదిరి పిరియాడిక్ డ్రామాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య యంగ్ డైరెక్టర్స్ కు వరుస అవకాశాలు ఇస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు బాలయ్య. ఒక బోయపాటి మినహా, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ప్రజెంట్ బాబీ.. ఇలా అందరూ యంగ్ డైరెక్టర్స్ కావడం విశేషం. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రాహుల్ సంకృత్యాన్ తో కన్ఫర్మ్ అయితే మరో యంగ్ డైరెక్టర్ బాలయ్య లిస్ట్ లో చేరినట్లే.. మరి ఈ కాంబినేషన్ నిజంగానే కార్యరూపం దాల్చుతుందేమో చూడాలి.

Also Read:తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

- Advertisement -