ఒకే వేదికపై నందమూరి హీరోలు..!

530
nbk
- Advertisement -

నందమూరి హీరోలు మరోసారి ఒకే వేదికపై సందడి చేరనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సక్సెస్ మీట్,కథానాయకుడు ఫంక్షన్‌లో కనిపించి సందడి చేసిన బాలకృష్ణ,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.

వెగెశ్న సతీష్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా మూవీ జనవరి 15వ తేదీన విడుదల కాబోతోంది. మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ 8వ తేదీన జెఆర్‌సీ ఫంక్షన్ హాల్‌లో జరగనుండగా బాలకృష్ణ, ఎన్టీఆర్ తిథిగా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

కొంతకాలంగా హిట్ లేక సతమతం అవుతున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు. మరోసారి నందమూరి హీరోలు ఒకే వేదికపై రానుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -