NBK:టీడీపీకి బాలయ్యతో ముప్పే?

18
- Advertisement -

టీడీపీకి బాలయ్య దురుసుతనం ఇబ్బందిగా మారుతుందా ? బాలయ్య ప్రవర్తన టీడీపీకి ఒక వర్గం ఓటు బ్యాంకును దూరం చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన బాలయ్య.. మూడోసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పార్టీ పరంగా పెద్దగా యాక్టివ్ గా లేని బాలయ్య.. ఈ మధ్య పార్టీ వ్యవహారాలకు సంబంధించి ముందు వరుసలో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైమ్ లో లోకేశ్ తో కలిసి పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు బాలయ్య. ఆ టైమ్ లో టీడీపీ నామమాత్రపు అధ్యక్ష హోదాలో బాలయ్య ఉంటారనే టాక్ కూడా గట్టిగా వినిపించింది.

అయితే కొన్ని సందర్భాల్లో బాలయ్య చేసే వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అందుకే బాలయ్య టార్గెట్ గా వైసీపీ నేతలు తెగ విమర్శలు గుప్పిస్తుంటారు. మరి ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ విషయంలో బాలయ్య వ్యవహరించే తీరు టీడీపీ ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం లేకపోలేదు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో జూ. ఎంట్రీ స్పందించకపోవడంపై బాలయ్య కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి జూ.ఎన్టీఆర్ విషయంలో వివాదానికి తెర తీశారు బాలయ్య. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలయ్య చెప్పిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నికల ముందు జూ. ఎన్టీఆర్ విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీ హైలెట్ అయితే టీడీపీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఎన్నికల ముందు బాలయ్య విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Also Read:ఓహో.. జాంబవంతుడి కథలో బాలయ్య

- Advertisement -