అతి తక్కువ టైంలో…తక్కువ బడ్జెట్లో సినిమాలు తెరకెక్కించడంలో పూరికి పూరీయే సాటి. పోకిరి,ఇడియట్,టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చిన పూరి ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాడు. వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. దీంతో ఇప్పుడు పూరితో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు. టెంపర్ తర్వాత వచ్చిన జ్యోతిలక్ష్మి, వరుణ్‌తేజ్‌తో తీసిన లోఫర్,కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించిన ఇజం డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. ప్రస్తుతం పూరి ముందు ఉన్న ప్రాజెక్టు రోగ్. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న పూరి …. మళ్లీ ఫాంలోకి వస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.
అలాంటి పూరి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. పూరితో సినిమాలు చేసేందుకు కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా సాహసించని పరిస్థితి. మహేష్‌తో సినిమా చేసే అవకాశం గడపదాక వచ్చిన ముందుకు మాత్రం కదలలేదు. ఈ సమయంలో పూరికి అదృష్టలక్ష్మీగా ముందుకువచ్చాడు బాలయ్య. పూరితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
పూరి సినిమాకు బాలయ్య ఓకే చెప్పడంపై టీ టౌన్‌లో గుసగుసల మొదలయ్యాయి. గతకొంత కాలంగా ఘోరమైన ప్లాప్ చిత్రాలను తీస్తున్న పూరి జగన్నాధ్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి బాలయ్య తప్పు చేశాడాని పలువురు చెబుతన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి భారీ విజయం తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం పూరి జగన్నాధ్ ది కావడంతో మిశ్రమ స్పందన వస్తోంది.
పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే బాలయ్యని సరికొత్త డైమెన్షన్ లో పూరి చూపిస్తాడని తప్పకుండా ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందని , బాలయ్య డైనమైట్ లాంటి డైలాగ్స్ పూరి డిఫరెంట్ టేకింగ్ వెరసి నందమూరి అభిమానులకు ఫీస్ట్ అంటూ కొంతమంది వాదిస్తుండగా మరికొంతమంది మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. మరి బాలయ్య తీసుకున్న నిర్ణయం సరైందో కాదో తెలియాలంటే సెప్టెంబర్ వరకు వేచిచూడాల్సిందే.