అమెరికాలో శివనామస్మరణ

174
NRI - Maha Shivaratri celebrations
- Advertisement -

దేశవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. శైవక్షేత్రాల్లో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. వారణాసి, కాశీ, హరిద్వార్‌, ఉజ్జయినితో పాటు ప్రసిధ్ద పుణ్యక్షేత్రాల్లో  భక్తులు పూజలు చేశారు. ప్రవాసభారతీయులు కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని మిల్ఫిటాస్ లోని శ్రీ సత్యనారాయరణ స్వామి దేవస్ధానంలో జరిగిన వేడుకల్లో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బ్రహ్మశ్రీ. వేదమూర్తులు.  మారేపల్లి నాగ వేంకట శాస్త్రి  సనాతన ధర్మాచరణాధ్వర్యంలో, వేదోక్తంగా పూజలు చేశారు. ఉదయం నుంచే రుద్ర పారాయణం మొదలుపెట్టి, ప్రత్యేక అభిషేకాలు,మహాన్యాస పారాయణ,ఏకాదశ రుద్రాభిషేకం, శివ పార్వతి కళ్యాణం, లింగోద్భవ కలం, వేదం పారాయణం, యామ అభిషేకం చేశారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. ఈ అద్భుతమైన కార్యక్రమములు గత 12 సంవత్సరములుగా అకుంఠిత  దీక్షతో  జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

NRI - Maha Shivaratri celebrations

- Advertisement -