నట సింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసిన ఇండస్ట్రీలో అది ఓ సెన్సషనల్‌గా మారుతుంది. కోపం, ప్రేమ అన్ని ఎక్కువే. సినిమాల్లో ఆవేశంగా కనిపించే బాలకృష్ణ రియల్ లైఫ్ లో కూడా అప్పుడప్పుడు అంతే సీరియస్‌గా కనిపిస్తుంటారు. ఈ మధ్య బాలయ్య సినీ పరిశ్రమలోని కొందరిపై సంచనల కామెంట్స్ చేశారు. ఇటీవల సినీ పెద్దలు కొందరు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమైయ్యారు. ఆ సమావేశం ఎప్పుడు జరిగిందో, ఆ సమావేశం గురించి నాకు తెలియదని బాలయ్య తెలుపగా.. ఆ విషయం ఇండస్ట్రీలో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కలిసి భూములు పంచుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య పరోక్షంగా చిరంజీవిపై కామెంట్స్ చేశారు. గతంలో చిరంజీవి చెప్పిన “మంచి మైకులో చెప్పాలి-చెడు చెవిలో చెప్పాలి” డైలాగ్‌ను వెటకారం చేశారు. అలా చేస్తే ఎవడికి ఉపయోగం ఉంటూ సూటిగా ప్రశ్నించారు. “చెడు చెవిలో చెప్పాలా.. మంచి మైకులో చెప్పాలా.. ఎందుకు? చెవిలో చెడు చెబితే ఏం చేస్తాడు. అంతర్మథనం పొందడం తప్ప. వాడు చెడు చేశాడు కాబట్టి మనం తిట్టాం కాబట్టి వాడు బాగుపడ్డాడనే తృప్తి ఉండాలి కదా. అది కూడా ఓ సేవ కదా. చెడు చెవిలో చెప్పడానికి నేనన్న మాట (భూములు పంచుకుంటున్నారని) ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఒకరి పేరు నేను చెప్పలేదు కదా. అందర్నీ కలిపి అన్నాను.”
దాసరి తర్వాత ఆ పెద్దరికాన్ని తీసుకోవడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా బాలయ్య సెటైర్లు వేశారు. ఇండస్ట్రీలో దాసరి లేని లోటును భర్తీ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని… కానీ ఒక్క శాతం కూడా ఆ లోటు భర్తీ అవ్వలేదన్నారు బాలయ్య. “దాసరి లేని లోటును వంద శాతం మిస్ అవుతున్నాం. ఆయన స్థానాన్ని ఎవ్వరూ ఒక్క శాతం కూడా భర్తీ చేయలేకపోతున్నారు. ఆయన శిష్యుడు కల్యాణ్ ఉన్నంతలో చేస్తున్నారు. గురువుగారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే.. ఇంకెవరూ లేరు.”