మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..

216
Balakrishna
- Advertisement -

నందమూరి వంశం నుండి బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్‌,కల్యాణ్‌ రామ్‌,తారక రత్న, హీరోలుగా చిత్ర పరిశ్రమలో అడుపెట్టిన సంగతి తెలిపిందే. అయితే అందులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌,బాలయ్య,కల్యాణ్‌ రామ్‌ వరుస సినిమాతో దూకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. మరి ఆ హీరో మరెవరో కాదు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ హీరోగా రానున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అంటూ ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత మూడు ఏళ్లుగా అప్పుడు ఇప్పుడు అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన మీడియాలో కూడా వార్తలు సందడి చేస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం బాలయ్య కథలు వింటున్నాడంటూ కొన్ని కథలు ఎంపిక చేశాడని వాటిల్లోంచి ఒకదాన్ని ఫైనల్ చేశాడని కూడా టాక్‌ వినిపిస్తుంది.

 Mokshagna

అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగినా కూడా వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవుతుందని చెబుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ పవర్‌ఫుల్‌ చిత్రంతో సెట్స్ పైకి వెళుతాడని అంతా భావించారు. కానీ ఈ విషయానికి సంబంధించిన సమాచారం ఇంతవరకూ బయటికి రాలేదు. తాజా ఇంటర్వ్యూలో బాలకృష్ణకి ఇదే ప్రశ్న ఎదురైంది. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడని ప్రశ్నించగా దీనిపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య స్పందిస్తూ .. “మోక్షజ్ఞ కోసం ఇంతవరకూ ఎలాంటి కథలను వినలేదు. మంచి కథ దొరికితే ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతాయి. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఓ సినిమా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. ఇక తన తదుపరి సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందనీ, ఎన్నికల హడావిడి పూర్తయిన తరువాత సెట్స్ పైకి వెళతామని అన్నారు. మరి వచ్చే ఏడాదైనా మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది వేచిచూడాలి.

- Advertisement -