బాలకృష్ణ-బోయపాటి మూవీ ముహుర్తం ఫిక్స్

382
balakrishna boyapati
- Advertisement -

నందమూరి బాలకృష్ణ తన 105వ సినిమా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈసినిమాకు రూలర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈమూవీలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చిత్రబృందం విడుదల చేసింది. కాగా డిసెంబర్ నెలలో ఈమూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

ఈమూవీ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈమూవీపై బాలకృష్ణ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ మూవీ భారీ విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం బోయపాటి స్క్రీప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు. కాగా తాజాగా ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈమూవీ షూటింగ్ ను డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. ఈచిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -