మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నటినటులను కూడా ఎంపిక చేయనున్నారు చిత్రబృందం. ఎన్టీఆర్ జివితంలో ముఖ్య పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల క్యారెక్టర్లను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ మొదటి భార్య బసవరతారకం గా బాలీవుడ్ నటీ విద్యాబాలన్ నటిస్తున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈచిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా డైరెక్టర్ క్రిష్ తన ట్విట్టర్ లో బాలకృష్ణకు జన్మదిన శుబాకాంక్షాలు తెలుపుతూ ట్వీట్ ఈవిధంగా ట్విట్ చేశారు. ‘తన నూరవ చిత్రంలో అమ్మ పేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు.
తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు",
ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు",
శతాధిక చిత్ర "నటసింహం",
నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HappyBirthdayNBK | #NTR | pic.twitter.com/oLbk9FLQWr— Krish Jagarlamudi (@DirKrish) June 9, 2018
ఈఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలలోని పాత్రలతో పాటు అవే పాత్రల్లో బాలకృష్ణను చూపించారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ క్రిష్ ఆయనకు తన తండ్రి సినిమా బయోపిక్ ను గిప్ట్ గా ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ లో బాలకృష్ణ మీసాలను ఆయన తండ్రి ఎన్టీఆర్ దిద్దుతున్నట్టు చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఈసినిమాను బాలకృష్ణ మరియు వారాహి సంస్ధలు సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తిసుకెళ్లెందుకు సన్నాహాలు చేస్తున్నారు డైరెక్టర్ క్రిష్.