జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పిన బాలయ్య…

253
balakrishna
- Advertisement -

సినీనటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గారు. తన నోటి దురుసు ప్రవర్తనతో వీడియో జర్నలిస్టుపై అసభ్య పదజాలంతో దూషిస్తూ వివాదంలో చిక్కుకున్న బాలయ్య ..పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పు తెలుసుకున్నారు. ఆ వీడియో జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు.

తాను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని.. మీడియా మిత్రులకు బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానని ఫేస్ బుక్ ద్వారా కోరారు బాలయ్య. మీడియా మిత్రులకి నమస్కారం, నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదన్నారు.

బాలయ్య మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడాన్ని స్థానికులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడంపై జర్నలిస్ట్‌ సంఘాలు మండిపడ్డాయి. దీంతో వెనక్కి తగ్గిన బాలయ్య క్షమాపణలు చెప్పారు.

- Advertisement -