వికారాబాద్ అడవుల్లో అఖండ..!

61
nbk

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఉగాది కానుకగా విడుదలైన మూవీ టైటిల్ రోర్, బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలకృష్ణ, శ్రీకాంత్ లపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందు ‘లెజెండ్’ చిత్రంతో జగపతి బాబును పవర్ ఫుల్ విలన్‌గా పరిచయం చేసిన బోయపాటి ‘అఖండ’తో శ్రీకాంత్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రంలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.