బాల‌య్య అఖండకు కరోనా ఎఫెక్ట్‌..

327
akhanda
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. 2021 మే 28న ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా అఖండ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

క‌రోనా ఉధృతి కార‌ణంగా టాలీవుడ్‌లో ఇప్ప‌టికే చాలా సినిమాలు వాయిదా ప‌డ్డాయి.ఇప్పుడు ఇదే బాట‌లో బాల‌య్య కూడా వెళ్తున్నాడు. అఖండ సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. మరో హీరోయిన్ పూర్ణ డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -