NBK 109..లేటెస్ట్ అప్‌డేట్

64
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో #NBK108 చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక NBK 109ని కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్‌చేయగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఓ కీలకమైన షెడ్యూల్ ని రీసెంట్ గా రాజస్థాన్ లో ప్లాన్ చేయగా ఆ షూట్ లో అయితే బాలయ్య జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ రానున్న కొన్ని రోజుల్లో సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ కూడా మేకర్స్ రివీల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:కరోనా కొత్త వేరియంట్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -