బాలయ్య న్యూ లుక్‌ చూస్తే షాకవ్వాల్సిందే..!

659
Balaiah New look
- Advertisement -

సింహం నందమూరి బాలకృష్ణ కథ డిమాండ్‌ చేస్తే ఎలాంటి పాత్రైనా,గెటప్‌ అయినా వేయడానికి ముందుంటారు. అంతేకాదు డైరక్టర్ చెప్పింది తూచ తప్పకుండా పాటించడం బాలయ్య నైజం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవలే ‘రూలర్’ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య ఐరన్ మ్యాన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలయ్య ఎంతగా శ్రమించారో తెలిసిందే. డిఫరెంట్ గెటప్‌ల కోసం అవసరాన్ని బట్టి బరువు పెరగడం.. తగ్గడం ఇలా పాత్రల కోసం ఛేంజోవర్ చూపిస్తుంటారు.

balakrishna

అయితే తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్న కొత్త చిత్రం కోసం బాలయ్య న్యూ లుక్ ట్రై చేస్తున్నారు.నున్నగా గుండు గీయించుకుని..వైట్ అండ్ ఖద్దరు బట్టల్లో,కోర మీసంతో బాలయ్య రాయల్ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈసారి పూర్తి ప్రయోగాత్మకంగా తెరపై కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం బాలయ్య కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -