బాలయ్య సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!

109
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు సంక్రాంతి రేసులో నిలిచిన బాలయ్య సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు పాజిటివ్ సెంటిమెంట్. పండుగకు విడుదలైన బాలకృష్ణ అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్‌ లు గా నిలిచాయి.

అందుకే 2023 సంక్రాంతికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు బాలయ్య. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వీరసింహారెడ్డి తెరకెక్కుతుండగా జనవరి 12న సినిమా రిలీజ్ కానుంది.

బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రం మాసస్ లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్‌ లో సంచలనం సృష్టించింది.దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోగా సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు.

బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -