అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి మూవీ నటించనున్నారు. అయితే ఈ మూవీ షెడ్యూల్ ఈనెల 23న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో బాలయ్యతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి – బాలయ్య బాబును మాస్ అండ్ కామెడీ కింగ్ గా చూపించనున్నాడు.
అన్నట్టు ఈ ప్రాజెక్టులో బాలయ్య ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి టీం చాలా పేర్లను పరిశీలించి చివరకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకుంది. ఇక బాలయ్య క్యారెక్టర్ లో కావాల్సిననన్ని వేరియేషన్స్ ను కూడా యాడ్ చేశారు. అందువల్ల పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది అనేది అనిల్ రావిపూడి టీమ్ నమ్మకం. పైగా స్క్రిప్ట్ మొత్తం భారీ యాక్షన్ ఫీస్ట్ అన్నట్లుగా యాక్షన్ సీన్లతో కథను నింపారు. మధ్యలో అనిల్ రావిపూడి కామెడీ స్టయిల్ ఎలాగూ ఉంటుంది.
అదే విధంగా ఈ సారి హీరోయిన్ తో బాలయ్యకి రొమాన్స్ సీన్లను కూడా పెట్టారు అనిల్. ఓవరాల్ గా అనిల్ రావిపూడి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూస్తే.. బాలయ్య ఫుల్ మాసీగా, మాన్లీగా కనిపించబోతున్నాడు. మొత్తమ్మీద నటసింహం బాలయ్య కోసం దర్శకుడు అనిల్ రావిపూడి మరో సూపర్ హిట్ సినిమాని రెడీ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకి కూతురిగా శ్రీలీల నటించబోతుంది.
ఇవి కూడా చదవండి…