అల్లూరి సీతారామరాజుగా బాలయ్య..

512
nbk
- Advertisement -

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది ఎన్టీఆర్ టీం. బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

తాజాగా అల్లూరి సీతారామరాజుగా కనువిందు చేశారు బాలయ్య. భారతదేశం నుండి తెల్లవాళ్లను తరిమికొట్టి మనకు స్వాతంత్యం అందించిన మహాపురుషులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం బాల‌కృష్ణ కూడా అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో అచ్చుగుద్దిననట్లు సరిపోయారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

జ‌న‌వ‌రిలో సినీ నేపథ్యంలో క‌థానాయ‌కుడు విడుద‌ల కానుండగా ఫిబ్ర‌వ‌రిలో రాజకీయ జీవితం నేపథ్యంలో మ‌హానాయ‌కుడు రిలీజ్ కానుంది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు.

alluri

- Advertisement -