బలగంతో షాకిచ్చావు..చిరంజీవి.!

54
- Advertisement -

తెలంగాణ సంస్కృతి సంప్రదాయం నేపథ్యంలో తీసిన సినిమాతో మా అందరికీ షాకిచ్చావు అని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. భోళా శంకర్ సినిమా సెట్‌లో బలగం టీంను సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా బలగం టీంతో కాసేపు ముచ్చటించిన చిరంజీవి…వేణూ ఇంత బాగా సినిమా చేసి మాకు షాకులు ఇస్తే ఎలా? నిజాయితీ ఉన్న సినిమా ఇది. తెలంగాణ సంస్కృతిని వందశాతం చూపించావు. దీనికి కమర్షియల్ ప్రోడ్యుసర్‌ ఉన్న నువ్వే దీనికి పూర్తి న్యాయం చేశావు అని మెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా వేణు గతంలో జబర్దస్త్‌ లో చేసిన ఓగ్గు కథ స్కీట్‌ను గుర్తుచేసుకోని…ఇంత టాలెంట్‌ ఉందా …తనలోని టాలెంట్‌ని మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడనిపించింది అని ఆయన అన్నారు. ఇదే బలగం స్టార్ ప్రియదర్శి ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. చిరు అన్నయ్యా మీసినిమాలు చూసి ఎన్నో సందర్భాల్లో నేను స్పూర్తి పొందాను. అలాంటిది ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమాభిమానాన్ని పొందడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది…బలగం కోసం మీరు చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు తప్పకుండా మీతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్టర్‌లో వీడియోతో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి…

వెయిటింగ్ లో చిరు దర్శకుడు

ఆస్కార్..నాటుసాంగ్‌కు స్టెప్పులేయనున్న లారెన్‌.!

పాన్ ఇండియా హీరోల సంక్రాంతి పోటీ!

- Advertisement -