- Advertisement -
కర్నూలు జిల్లాకు చెందిన బాలసాయిబాబా శివైక్యం పొందారు. లోయర్ ట్యాంక్‌బడ్‌లో నిన్న రాత్రి బాలసాయిబాబాకు గుండెపోటు రావడంతో.. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
బాల సాయిబాబాకు రాష్ట్రవ్యాప్తంగానూ అనేకమంది భక్తులున్నారు. బాల సాయిబాబా ఎంత పేరు ప్రఖ్యాతులు గడించారో, అంతగానూ వివాదాస్పదుడయ్యారు. బాల సాయిబాబా హఠాన్మరణంతో ఆయన భక్తులు శోఖసంద్రంలో మునిగిపోయారు.
బాల సాయిబాబా అనగానే… ఆరోపణలు, కేసులు, అక్రమాలే గుర్తొస్తాయి. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వందల కోట్ల ఆస్తులకు ఎదిగారని కొందరు అంటారు. బాల సాయిబాబా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కేసులో న్యాయస్థానం భూ కబ్జాదారునిగా నిర్థారించింది.
- Advertisement -