Bajireddy:రేవంత్‌ ముఖ్యమంత్రివా?రౌడివా?

30
- Advertisement -

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? రౌడినా అని ప్రశ్నించారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన ఆయన…పేగులు మెడ‌లో వేసుకోవ‌డానికి.. నువ్వేమైనా మేక‌లు, కోళ్లు కోసేటోడివా..? బొంద పెట్ట‌డానికి, బుల్లెట్లు దించ‌డానికి అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేత‌ల‌ను పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత కుక్క‌ల కంటే హీనంగా చూస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డిని కాంగ్రెసోళ్లే బొంద పెడుతార‌ని ఆ పార్టీ నాయ‌కుడే ఒక‌రు త‌న‌కు ఫోన్ చేసి చెప్పార‌ని అన్నారు. హ‌నుమంత రావు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వీళ్లంతా క‌త్తులు ప‌ట్టుకుని తిరుగుతున్నారు.. రేవంత్‌ను ఎప్పుడు పొడిచేది తెల్వ‌దు అని చెప్పుకొచ్చారు.

Also Read:కడియంకు సవాల్ విసిరిన రాజయ్య..

- Advertisement -