కరోనా ఎఫెక్ట్…బాహుబలి,భల్లాలదేవుడికి మాస్క్ లు

164
bahubali mask
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాల్సి వస్తోంది. మాస్క్ లు లేకుండా బయట కనిపిస్తే పోలీసులు ఫైన్ కూడా వేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్ పెరిగింది. కరోనా రాకముందు 5రూపాయలు ఉన్న మాస్క్ ఇప్పుడు 50రూపాలకు అమ్ముతున్నారు. కొన్ని సంస్ధలు వినూత్నంగా ప్రకటనలు ఇచ్చి మాస్కులు అమ్ముతున్నాయి.

తాజాగా ఓ గ్రాఫిక్స్ సంస్ధ మాస్కుల అమ్మకానికి వినూత్నంగా ప్రచారం చేశాయి. బాహుబలి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమూవీలోని సీన్లను మాస్క్ ల అమ్మకానికి వాడుతున్నారు. బాహుబలి, భల్లాలదేవుడు ఫైటింగ్ సీన్లో మాస్కులు ధరించి పోరాడుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేశారు. మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి అని, మీరు కూడా మాస్కులు ధరించడం మర్చిపోవద్దని ఆ గ్రాఫిక్స్ వీడియోలో పేర్కొన్నారు. తాజాగా ఈవీడియో చూసిన దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్ సంస్ధలను అభినందించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని సూచించారు రాజమౌళి.

- Advertisement -