సూర్యపేట జిల్లా సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. జీరో అవర్లో రహదారుల అభివృద్ధి,విద్యా సంస్థల ఏర్పాటుపై మాట్లాడిన బడుగుల…జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు.పాస్ పోర్ట్ సేవా కేంద్రం లేక పోవడంతో స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు.
కేంద్రీయ విద్యాలయాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని విజప్తి చేశామన్నారు. కేంద్రీయ విద్యాలయాల చట్టం ప్రకారం జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఉండాలి కానీ అలా జరగలేదన్నారు.పాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రెండు, మూడు ఏళ్లు గడుస్తోన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. సిఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలం అనేక మార్లు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు.
జాతీయ రహదారి 65 లో అండర్ పాస్ లు నిర్మించాలని కోరారు. అండర్ పాస్ లు లేకపోవడం వల్ల, రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యు వాత పడుతున్నారని పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు బడుగుల లింగయ్య యాదవ్.