మంథనిని సందర్శించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కేయూర..

91
- Advertisement -

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కేయూర ఆల్ ఇండియన్ కేటగిరిలో 12వ ర్యాంకు అంతర్జాతీయ కేటగిరిలో 240వ ర్యాంకులో కొనసాగుతుంది. కేయూర జాతీయ అంతర్జాతీయ పోటీలలో ఎన్నో పతకాలు సాధించింది. ఈ మధ్యకాలంలో ఐరిష్ ఓపెన్ చాలెంజ్‌లో కాంస్య పతకం సాధించిన కేయూర. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తనకు ఎంతో స్ఫూర్తిని అందిస్తున్నారని వారి ప్రోత్సాహంతోనే క్రీడలో రానిస్తున్నట్లు తెలిపింది. కోచ్ గోపిచంద్ సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. మార్చిలో జరిగే యూరోప్ టోర్నమెంట్ కోసం కోవిడ్ దృష్ట్యా ఇంట్లోనే ఫిట్ నెస్, డైట్‌తో పాటు ప్రాక్టీసు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఎందరో మేధావులకు పుట్టినిల్లుగా విలసిల్లుతున్న మంథనిలో ఒక యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తుండడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు.

- Advertisement -