చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

18
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ని సైతం సంప్రదించిన సంగతి తెలిసిందే. ఇక నారా లోకేష్‌తో స్వయంగా కలిసి రావడంతో టీడీపీతో పీకే కలిసి పనిచేయడం ఖాయమనుకున్నారు.

కానీ ఇదంతా ఉట్టిదే అని తేలిపోయింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్.. ఏపీలో టీడీపీ కోసం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. చంద్ర బాబుతో భేటీపై ప్రశాంత్‌ను వివరణ కోరగా.. అవును, నేను ఇటీవల విజయవాడలో చంద్ర బాబును కలిశాను. తనకు, చంద్రబాబుకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బాబును కలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని …చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలవాలని పట్టుబట్టడంతో విజయవాడ వెళ్లానని తెలిపారు.

2019 ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్యాడ్ లక్‌ అని భావిస్తున్నారు పొలిటికల్ ఎనలిస్ట్‌లు.

Also Read:అభిన‌వ్ గోమఠం హీరోగా మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా!

- Advertisement -