సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా:బడే నాగజ్యోతి

35
- Advertisement -

సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామన్నారు ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. నాకు ములుగు అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన్నప్పుడే ములుగు లో విజయం ఖాయం అయిందన్నారు.

పనులు ఎవరు చేస్తారు అనేది ములుగు ప్రజలకు అందరికి తెలుసు అని…ములుగు జిల్లాకు మంచి నీళ్ళు ఇంటింటికీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. మెడికల్ కాలేజి వచ్చింది ఇవన్నీ అందరికి తెలుసు అన్నారు. మాటలు ఎవరివి చేతలు ఎవరివి అనేది అందరికి తెలుసు అన్నారు. నాకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.ములుగు ఎమ్మెల్యే గా గెలిసి కేసీఆర్ కానుక ఇస్తానని చెప్పారు.

సీఎం కేసీఆర్ మాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నారని…సమ్మక్క సారక్క ఆశీస్సులతో మళ్ళీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను,బీఆర్ఎస్ అభ్యర్థులపై సమ్మక్క సారక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు అన్నారు.

Also Read:చంద్రయాన్ -3..తెలంగాణ కీలక నిర్ణయం

- Advertisement -