రేణు దేశాయ్ పై బ్యాడ్ హెడ్డింగ్స్

32
- Advertisement -

‘పవర్ స్టార్ మాజీ సతీమణి’ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ”ఎట్టకేలకు నిన్న యానిమల్ సినిమా చూడాల్సి వచ్చింది. నిస్సందేహంగా దానితో ప్రేమలో పడ్డాను. క్రేజీ, బ్లడీ యాక్షన్ సీక్వెన్స్‌ల కారణంగా ఈ సినిమా బలహీనమైన హృదయం ఉన్నవారి కోసం అయితే కాదు, కానీ, మీరు ఏదైనా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా థియేటర్‌లో చూడటం మిస్ అవ్వకండి” అని సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రాసుకొచ్చింది. అయితే, రేణు దేశాయ్ కామెంట్స్ లోని కొన్ని పదాలను బట్టి, కొన్ని వెబ్ సైట్స్ డబుల్ మీనింగ్ వచ్చేలా హెడ్డింగ్స్ పెట్టాయి.

ముఖ్యంగా ‘ఎట్టకేలకు నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను’ అని రేణు దేశాయ్ చెప్పినట్లు హెడ్డింగ్ పెట్టారు. మరికొందరు అయితే, ఈ హెడ్డింగ్ తో ముడిపెట్టి.. ఆమె రెండో పెళ్లి పై కూడా కొత్త కథనాలు అల్లేశారు. రేణు దేశాయ్ మరో కొత్త వ్యక్తితో ప్రేమలో పడింది అని, ఎంగేజ్ మెంట్ చేసుకున్న వ్యక్తిని కూడా రేణు దేశాయ్ కాదు అనుకుంది అని, అందుకే, ఆమె మళ్లీ ప్రేమలో పడ్డాను అని కామెంట్ చేసింది అని రాసుకొచ్చారు. పాపం, రేణు దేశాయ్.. అసలు ఆమె చెప్పింది ఏమిటి ?, ఈ గాసిప్ రాయుళ్లు రాస్తోంది ఏమిటి ?, ఏ మాత్రం అయినా సంబంధం ఉందా ?, ఇంతకీ, ఈ వార్తల పై రేణు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇక రేణూ దేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అని రీసెంట్ గా కూడా క్లారిటీ ఇచ్చింది. ఏ వ్యక్తితో అయితే ఎంగేజ్ మెంట్ చేసుకుందో ఆ వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోబోతుంది. తన రెండో పెళ్లి పై రేణు దేశాయ్ ఏం చెప్పింది అంటే.. ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. ఒక వ్యక్తి వల్ల నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావ్ అంటే.. హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని వాళ్లు నాతో తరుచూ అంటూ ఉంటారు. అందుకే, నేను ఎంగేజ్ మెంట్ చేసుకున్న వ్యక్తితోనే నా రెండో పెళ్లి కచ్చితంగా ఉంటుంది’ అని రేణు దేశాయ్ మళ్ళీ చెప్పుకొచ్చింది.

Also Read:చామదుంప తింటే ఎన్ని ప్రయోజనాలో..!

 

- Advertisement -