నోటి దుర్వాసనా..అయితే జాగ్రత్త!

111
- Advertisement -

నేటిరోజుల్లో చాలమంది కిడ్నీ వ్యాధులతో బాధ పడుతూ ఉంటారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుద్ది చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీల పనితీరు మందగిస్తే ప్రమాదంలో పడినట్లే. కిడ్నీ వ్యాధులలో ప్రధానంగా చాలమంది ఎదుర్కొనే సమస్య వాటిలో రాళ్ళు ఏర్పడడం. కిడ్నీలో రాళ్ళు అధికంగా ఏర్పడే వరకు వాటిని గుర్తిచడంపై నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఫలితంగా సర్జరీ తప్పా వేరే మార్గం కనిపించదు. అయితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయనే సంగతి కొన్ని లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు.

సాధారణంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే.. వీపు కింద ఎడమ వైపు లేదా కుడి వైపు తరచూ నొప్పిగా ఉంటుంది. ఇంకా మూత్ర విసర్జన చేసే టైమ్ లో కూడా మంట, నొప్పి వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుందా వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లైతే మూత్రం తరచూ రావడంతో పాటు.. ఎరుపు రంగులో మూత్రం కనిపిస్తుంది. కొన్ని సార్లు రక్తం కూడా రావోచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లు గమనించాలి.

కిడ్నీ సమస్య వల్ల శరీరంలో ఐరన్‌తో పాటు అనేక రకాల పోషకాల లోపం ఏర్పడుతుంది. దీంతో పాటు ఎర్ర రక్త కణాలు కూడా తగ్గుతాయి. ఇవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెయింటెన్‌ చేసే కణాలు. RBCలు లేకపోవడం వల్ల అలసటను ఎదుర్కోవలసి వస్తుంది. నోటి దుర్వాసన తరచుగా దంతాలు శుభ్రం చేయకపోవడం, ఉల్లిపాయ-వెల్లుల్లి తినడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కానీ ఇలాంటివి ఏమి చేయకుండా నోటి దుర్వాసన వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇవి కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు.

Also Read:చామదుంప తింటే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -