థియేటర్ల బంద్..దిల్ రాజే కారణం!

14
- Advertisement -

దిల్ రాజు అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు అన్నారు జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన సత్యనారాయణ.. జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రస్తావించలేదు అన్నారు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి, అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు అన్నారు.

దిల్ రాజు కమల్ హసన్ ని మించిపోయేలా నటించి, పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వగానే జనసేన పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చాడు అన్నారు. ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి ప్రధాన కారణమని అత్తి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసింది జనసేన.

Also Read:రానా నాయుడులో సునీల్ గ్రోవర్!

- Advertisement -