వాళ్లు ముద్దుపెట్టుకుంటే ఈ చిన్నారికి ఎంత కోపమో !

239
Online News Portal
baby starts crying every time parents kiss
- Advertisement -

చిన్న పిల్లలు ఏది చేసినా ఫన్నీగా ఉంటుంది. వారు చేసే చిలిపి పనులు ఎంత ఫన్‌ని క్రియేట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో అయితే చిన్న పిల్లల ఫన్నీ వీడియోలు టాప్‌ ట్రెండింగ్‌లో ఉంటాయి. వాళ్ల అమాయకత్వం, క్యూట్‌నెస్‌తో ఎప్పుడూ ఆకర్షిస్తారు. అలాంటిదే ఈ వీడియో కూడా.. అమ్మానాన్నలు తన ఎదుట ముద్దుపెట్టుకుంటే ఈ చిన్నారికి చెప్పలేనంత ఉక్రోషమో.. చదవండి.

అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన మ్యాత్‌- క్రిస్సీ దంపతుల చిన్నారి కూతురు ఎల్లా. ఆ దంపతులు తమ కూతురి వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇపుడది వైరల్ అయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పాప పెరేంట్స్‌ మ్యాత్‌- క్రిస్సీలు ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటే.. ఆ బుజ్జి పాపాయి ఏడుపు అందుకుంటుంది. తమ పాపను ఒకసారి చూడండంటూ పాప తల్లి పోస్ట్ చేసిన వీడియోను 14 లక్షల మంది చూడగా.. లక్షా 35 వేలకు పైగా షేర్లు చేశారు. ‘ ఎప్పడూ ఆనందంగా ఉండే మా బేబీ గాళ్‌కు ఒక బలహీనత ఉంది. ఆమె మమ్మీ డాడీలు కిస్ చేసుకోవడం నచ్చదు. ఇలా చేస్తున్నందుకు క్షమించండి అంటూనే ఈ వీడియోను ఒకసారి చూడండంటూ’ పోస్ట్ చేసింది.

bab

తమ పాప ఎల్లా అలవాటును గమనించాక.. పాపను టీజ్‌ చేయకుండా ఉండలేకపోతున్నారట వారు. ఈ వీడియోలో ఎల్లా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తుంది. అయితే పాప తల్లిదండ్రులు కిస్ చేసుకుంటే తట్టుకోలేదు. తన పెదవులు ఒకరకంగా పెట్టి ఏడుస్తుంది. పాపను కూల్ చేయడానికి వారు ప్రయత్నిస్తారు. మళ్లీ కిస్‌ చేసుకుంటే.. పాప మళ్లీ ఏడుపు అందుకుంటుంది.ఆ తర్వాత కూడా తల్లిదండ్రులు ముద్దుపెట్టుకున్న ప్రతిసారి ఆ చిన్నారి ఏడుపు అందుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్ అయిన వీడియోను మీరు ఒకసారి చూడండి…

https://youtu.be/Y2-INEDRA18

- Advertisement -