నేను గ్లామర్ బాయ్ ను కాదు.. హ్యాండ్ సమ్ గా లేను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చానని సినీనటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు మోహన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. నో బ్యాక్ గ్రౌండ్ .. నో రెకమెండేషన్. సినిమాల్లోకి వచ్చాక తహసీల్దార్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. చిత్ర సీమలో అన్ని చిత్రాలే. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని వెల్లడించారు.
ఇక కమెడీయన్ బ్రహ్మానందంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు బాబు మోహన్. కాకపట్టడంలో బ్రహ్మానందంకు సాటి ఎవరులేరన్నారు. కాకపట్టడానికి ఆయన ఎంత దూరమైన వెళతారని తనకు ఆ అలవాటు లేదన్నారు. ఇక ఇండస్ట్రీలో తాను కోడి రామకృష్ణ, ఈవీవీ, కోట శ్రీనివాస్ రావు ఇంటికి మాత్రమే తరచు వెళుతుంటానని వెల్లడించాడు. ఫంక్షన్లలో తిరగడం అనవసర పబ్లిసిటీ కోసం పాకులాడటం తనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదన్నారు.