ఫుడ్, మెడిసిన్స్, కాస్మోటిక్స్‌లలో సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు బాబా రాందేవ్.. టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామాల మధ్య ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ముంబైలో ప్రపంచ శాంతి, సామరస్య సమావేశంలో ఈ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై ప్రసంగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న రాందేవ్‌ను దగ్గరికి పిలిచారు దలైలామా. రాందేవ్ దలైలామా పాదాలను నమస్కరించారు. ఆ తరువాత రాందేవ్ గడ్డం పట్టుకొని చెవిలో ఏదో చెప్పిన దలైలామా.. తర్వాత రాందేవ్ పొట్టపై కొడుతూ సభికులను నవ్వించారు.
ఈ సందర్భంగా దైలామా మాట్లాడుతూ భయం చికాకు కలిగిస్తుందని, చికాకు కోపానికి కారణమై.. అది హింసను ప్రేరేపిస్తుందని చెప్పారు. ఇక ప్రస్తుతం ఇండియా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాందేవ్ బాబా స్పందించారు. తాము శాంతి మార్గంలోనే వెళ్తామని, అది చైనాకు అర్థం కాకపోతే వాళ్లకు అర్థమయ్యే యుద్ధంతోనే సమాధానం చెప్పాలని రాందేవ్ అన్నారు. అయినా చైనాకు శాంతిపై నమ్మకం లేదని, ఒకవేళ ఉంటే దలైలామా ఇక్కడ ఉండేవారు కాదని రాందేవ్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఇండియా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామా స్పందించిన సంగతి తెలిసిందే. హిందీ, చీనీ భాయ్‌భాయ్ ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని ఆయన స్పష్టంచేశారు. రెండు దేశాలు సోదరుల్లాంటివని, శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది కాబట్టి తనకు ఇండియా అంటే ఇష్టమని, ఫ్రీడమ్ లేని చోటు తనకు నచ్చదని దలైలామా అన్నారు. కాగా, దలైలామాకు ఆతిథ్యం ఇవ్వవద్దంటూ చైనా భారత్‌తో పాటు ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తుందన్న సంగతి తెలిసిందే.
#WATCH: Dalai Lama and Baba Ramdev share a light moment at World Peace & Harmony Conclave in Mumbai pic.twitter.com/JACFezv56B
— ANI (@ANI) August 13, 2017