రజినీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌…

124
- Advertisement -

తెలుగులో ఒక కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చిన రీరిలీజ్ హవా కొనసాగుతుంది. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పాకింది. దీంతో రీరిలీజ్ ఆంశంపై తమిళ తంబిలు సరికొత్త ప్రణాళికలతో ప్రేక్షకులను మమైరిచిపోయెలా చేయడానికి వస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న జైలర్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నవేళ తాజాగా మరోగుడ్‌ న్యూస్‌ ప్రకటించింది. 2002లో వచ్చిన రజినీకాంత్‌ కెరీర్‌లో స్పెషల్ సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా బెస్ట్ క్వాలిటీతో ఉండేలా బాబాను రీఎడిట్ చేస్తున్నట్టు కోలీవుడ్‌ టాక్.

బాబాను కొత్త వెర్షన్‌లో విడుదల చేస్తున్నట్టు సమాచారం బాబా సినిమాలోని పాటలను డోల్బీ మిక్స్‌ సౌండ్‌తో రీమాస్టర్డ్‌ రూపంలోకి తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమాను సురేశ్‌ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన సినిమాకు… కథ స్క్రీన్‌ప్లే అందించారు రజినీకాంత్. డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడిలో 25శాతాన్ని తిరిగి ఇచ్చేశారు. బాబా సినిమాను తలైవా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి…

సీరియస్ సినిమా కాదంటున్న హీరో

విజయవాడలో మహేష్ బాబు

అసలు సంగతి చెప్పిన దిల్ రాజు

- Advertisement -