బాహుబలి2.. సెన్సార్ రిపోర్ట్‌

213
Baahubali2 censor update
Baahubali2 censor update
- Advertisement -

దేశవ్యాప్తంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే అది ఖచ్చితంగా బాహుబలి2 సినిమానే అని చెప్పాలి. ఈ నెల 28న బాహుబలి2 విడుదల చేయనుండగా.. ఇప్పుడీ మూవీ గురించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. సోమవారం ఈ చిత్రం సెన్సార్ పూర్తైందని టాక్. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేకున్నా.. ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ ప్రకారం ఏప్రిల్ 17న చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. బాహుబలి-2కి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు అన్నట్టు తెలుస్తోంది. ఆయా భాషల్లోనూ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం బాహుబలి చిత్రం వేచి చూస్తోందట. వాటి క్లియరెన్స్ వచ్చాక ఒకేసారి అధికారికంగా సెన్సార్ సర్టిఫికెషన్ గురించి వెల్లడించాలని చిత్ర బృందం నిర్ణయించిందట. కాగా, ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-2 సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? శివగామి ఎలా చనిపోయింది? అవంతిక అక్కడెందుకుంది? ఇలా చాలా ప్రశ్నలు బాహుబలి మొదటి పార్టులో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అభిమానులు ఎంతో అత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకొద్ది రోజుల్లో దొరకనుంది. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ రెండో భాగం.. టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేయనుందనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే ఉండనుండడంతో.. ఈ వారం చివరికల్లా యూఎస్ తో పాటు ఇతర దేశాలు ప్రింట్స్ ను పంపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళ్.. మలయాళం.. హిందీల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

- Advertisement -