ప్రభాస్ -రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట పాన్ ఇండియా మూవీ చిత్రం బాహుబలి. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. బాహుబలి ది కంక్లూజన్ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన నేపథ్యంలో రీ రిలీజ్‌పై కీలక ప్రకటన చేశారు నిర్మాత శోభూ యార్లగడ్డ.
అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉన్నాను. బాహుబలి మూవీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి అని నిర్మాత శోభూ యార్లగడ్డ ట్వీట్ చేశారు.
ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.
Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

